Breaking News

ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 5న “ఆకాశవాణి వాకథాన్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో జూన్ 5, 2026న నగరంలో “ఆకాశవాణి వాకథాన్” నిర్వహించనున్నట్లు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగం అధిపతి జి. దివ్య తెలిపారు.

వాకథాన్ జూన్ 5వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి-అడ్రస్ మాల్ వరకు సాగి, తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది.

ఆకాశవాణి నినాదమైన “బహుజన హితాయ, బహుజన సుఖాయ” స్ఫూర్తితో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన అద్భుతమైన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆమె తెలిపారు.

ఈ వాకథాన్‌లో ఆకాశవాణి, దూరదర్శన్ సిబ్బంది, నగర ప్రముఖులు, రేడియో రంగానికి చెందిన ప్రముఖులు, శ్రోతలు తదితరులు పాల్గొననున్నారు. మొత్తం సుమారు 250 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా నగర ప్రజలు, శ్రోతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకాశవాణి వాకథాన్‌ను విజయవంతం చేయాలని జి. దివ్య కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *