-బెజవాడ చరిత్రలో కేశినేని చిన్ని విజయం ఒక నూతన అధ్యాయం
-విజయవాడ పార్లమెంట్లో కూటమి ప్రభుత్వ పెద్దదిక్కుగా కేశినేని చిన్ని
-దుర్మార్గ పాలనకు స్వస్తి చెప్పిన ప్రజానీకం
-కూటమి అభ్యర్థిగా చిన్ని గెలుపును గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకున్న క్యాడర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ( గాంధీ) గ్రంథాలయ చైర్మన్ బేగ్, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు
విజయవాడ( ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా ఎంపీ కేశినేని చిన్ని విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరియు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తరుణంలో పార్టీ క్యాడర్ సంబరాలు నిర్వహించారు మొదటిగా పార్టీ నాయకులు క్యాడర్ అందరూ కలిసి ఎంపీ చిన్ని విజయం మరియు కూటమి విజయాన్ని గుర్తు చేసుకుంటూ కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దుర్మార్గుని కబంధహస్తాల నుండి రాష్ట్రం విడుదల పొంది రెండేళ్ల కాలం పూర్తయిందని కూటమి ప్రభుత్వ విజయానికి ప్రజలు ఘన స్వాగతం పలికారని అన్నారు. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహకారంతో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పదంగా ముందుకు వెళుతుందని ఇంకా ఈ విజయాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
వైసిపి సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని అన్నారు. వ్యక్తిగత కక్షలు వేధింపుల రాజకీయాలకు ప్రజల స్వస్తి పలికారని అన్నారు వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకబడిందని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కూటమికి ప్రజలంతా అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రాష్ట్రం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందని అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు.
అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం సంకల్పం చాలా గొప్పదని రెండేళ్ల కాలంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని అభివృద్ధిని పరుగులు పెట్టించాలని తన పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలకు అవసరం అన్న ప్రతిసారి నిధులను అయితేనేమి కంపెనీలు అయితేనేమి రోడ్లు మరమ్మతులైతేనేమి ఆర్యూబీలైతేనేమి డ్రైనేజీ పనులు అయితేనేమి సాంస్కృతిక కళలు టూరిజం క్రీడలు ఇలా అనేక రకాలుగా విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఎంపీ చిన్ని క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. భవిష్యత్తులో మరొకసారి ఎంపీ చిన్ని, విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు
ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ , జాస్తి సాంబశివరావు తూమాటి ప్రేమ్ నాథ్, గొల్లపూడి గ్రామ టిడిపి అధ్యక్షులు నూతలపాటి నారద , షేక్ ఆషా,ఉషారాణి ప్రసాద్ , మాదిగని గురునాథం ఫతావుల్లా, కాకు మల్లికార్జున్ యాదవ్,నరసింహం చౌదరి పిళ్ళా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వ్యాస్, సోలంకి రాజు, శిరీష గాంధీ, కిలారి చంద్రశేఖర్ ,మాధవి ,దళిత రత్న పరిసపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News