Breaking News

ముఖ్యమంత్రి ట్వీట్

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు (జూన్ 5) సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు
-పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్‌పై వెళ్లనున్న ముఖ్యమంత్రి
-విశాఖ పర్యటనలో పాల్గొనే కార్యక్రమానికి సైకిల్‌పై సీఎం
-ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు రేపు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలన్న సీఎం
-పచ్చదనం పెంచేలా ప్రతీ ఒక్కరూ రేపు ఒక మొక్క నాటాలని కోరిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *