– ప్రత్యేక కోర్టుకు క్యాబినెట్ ఆమోదం హర్షణీయం..
– అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 12 సంవత్సరాలుగా పోరాడిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విజయవాడలోని దాసరి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖరరావు మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టును 21 మంది సిబ్బందితో ఏర్పాటు చేయుటకు క్యాబినెట్ ఆమోదించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. అలాగే కుటుంబరావు , డిజిపి రవిశంకర్ అయ్యన్నర్ ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
నిరంతరాయంగా పట్టు వదలకుండా ఉద్యమం చేసినందున గతంలో 10.43 లక్షల మందికి రూ 20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు ఇప్పించగలిగామని తెలియజేశారు. అలాగే ఆత్మహత్యలకు,గుండెపోటులకు, దిగులుతో మరణించిన వారికి 142 మందికి రూ 5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇప్పించిన చరిత్ర అసోసియేషన్ దేనని తెలిపారు. మార్చి 2 నుండి 6 తేదీ వరకు జరిగిన రిలే దీక్షలు, నిరవధిక దీక్షలు చేసిన సందర్భంగా సీఎం స్పందించి కొద్దిపాటి సమయం ఇవ్వండి పూర్తిస్థాయిలో ఆస్తులమ్మి డబ్బులు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముప్పాళ్ళ నాగేశ్వరరావు, నాయుడు, తిరుపతిరావు ,చంద్ర శేఖర్ తదితరుల ప్రతినిధి బృందానికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు
తెలియజేశారు. ఈ మేరకు పి4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు , టీడీపీ జాతీయ నాయకుడు వర్ల రామయ్య దీక్షా శిబిరానికి విచ్చేసి దీక్ష విరమింప చేయించారని తెలిపారు. నెలరోజుల తరువాత క్యాబినెట్ సమావేశంలో ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.
తదనంతరం క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా సబ్ కమిటీ నియామకం డెడికేటెడ్ సిఐడి టీం ఏర్పాటు చేయటం తదితరాలు ఆలస్యమైనందుకు ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందన్నారు. మొత్తం 32 లక్షల మంది బాధితుల్లో 19.52 లక్షల మంది ఒక ఏపీలోనే ఉన్నట్లు చంద్ర శేఖర్ తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏలూరు స్పెషల్ కోర్టులో సుమారు 350 పైగా కేసులు వేయించి పరిష్కారం కాకుండా కుట్రలు చేస్తోందన్నారు . యాజమాన్యానికి ఏ మాత్రం నిజాయితీ ఉన్న అన్ని అడ్డంకులను ఉపసంహరించుకొని, దాచిన బినామీ ఆస్తులను సిఐడి విభాగానికి అప్పగించి ప్రభుత్వానికి కోర్టుకి సహకరించాలని హితవు పలికారు. ప్రభుత్వం అవసరమైన జీవోలు ఇచ్చి అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతినట్లు డిపాజిట్ చెల్లించినట్లు చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ విజయం వైపు నడిపిస్తున్న అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు షరీఫ్, వెంకటేష్, మణికంఠ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News