Breaking News

పశ్చిమలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని వినతి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని భవానిపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధురాంతకం శ్రీనివాసరావు ఎమ్మెల్యే సుజనా చౌదరికి లేఖ రాసారు. వెల్డింగ్ , మరియు ఫాబ్రికేషన్స్ షాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక వర్కర్స్ కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎప్పుడూ ముందుంటారని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. భవానిపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మడకర నారాయణ బాబు, ఆర్ధిక కార్యదర్శి యనమదల నరేంద్ర కూటమి నేతలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, దుర్బేసుల హుస్సేన్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, చల్లం రాజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదిగొండ శివ , పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *