Breaking News

“నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం లో భాగంగా ఈ రోజు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విస్తృతంగా అనంత అరణ్యాలు (హై డెన్సిటీ ప్లాంటేషన్ ) ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకు తగ్గట్లు మొక్కల కోసం పిట్ డిగ్గింగ్ ( గొయ్యిల తవ్వకం ) జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల గౌరవ జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి బీసీ, SC ,ST సంక్షేమ గురుకులాలు, హాస్టల్లో స్వయం సాధికారత ,స్వయం సమృద్ధి సాధించే విధంగా కార్బన్ తగ్గించేందుకు హై డెన్సిటీ ఫారెస్ట్, విద్యుత్తు కోసం సోలార్ ప్యానెల్లు, మురుగునీటి నిర్వహణ, పునర్వినియోగం , వాన నీటి నిర్వహణ, భూగర్భ జలాలు పెంపు వంటి కార్యక్రమాలు అమలు కాబోతున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *