Breaking News

అమరావతి ప్రతిష్ఠ పెంచిన ‘విట్’

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ప్రతిష్ఠ పెంచేలా విట్ -ఏపీ విశ్వవిద్యాలయం యాజమాన్యం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. విట్-ఏపీ యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను మంత్రి సవిత శుక్రవారం తిలకించారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్ పోటీలను తిలకించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అమరావతిలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ ను అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఈ చెస్ టోర్నమెంట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం ద్వారా మరిన్ని క్రీడలకు అమరావతి భవిష్యత్తులో వేదిక కావడం తథ్యమన్నారు. చెస్ మెదడుకు పదును పెడుతుంది, వ్యూహాత్మక ఆలోచనను బలపరచడంతో పాటు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మంత్రి సవిత విట్ యూనివర్శిటీ ప్రాంగణంలో మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని స్పష్టంచేశారు. మొక్కల పెంపకం, సైకిళ్ల వినియోగంతో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలు కలుగుతుందన్నారు. భవిష్యత్తరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందన్నారు. పెట్రోలియం వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత రవాణా విధానాలను ప్రోత్సహించే చర్యలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మద్దతునిస్తోందన్నారు. రవాణా సాధనాలుగా ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్లను వినియోగించడం ద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషించవచ్చునని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, విట్ – ఏపీ యూనివర్శిటీ వైఎస్ చాన్సలర్ డాక్టర్ పి. అరుళ్‌మొళివర్మన్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ బైక్ పై యూనివర్శిటీకి…

అంతకుముందు రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి సవిత ఈ బైక్ పై విట్ – ఏపీ యూనివర్శిటీకి బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు మంత్రి సవిత ఈ బైక్ ను వినియోగించారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తరవాత కూడా ఆమె ఈ బైక్ పైనే రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *