అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో జరుగుతున్న వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐఏఎస్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. తొలుత మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో ప్రతిపాదిత E-13 రహదారి విస్తరణ పనుల కోసం అవసరమైన భూములను కార్తీక్ పరిశీలించారు. ఈ సందర్భంగా బి.ఎల్. చెన్నకేశవరావు (డైరెక్టర్, ల్యాండ్స్ – క్యాపిటల్ రీజియన్), తెనాలి ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సంబంధిత అంశాలను సమీక్షించారు. తదుపరి కార్యాచరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం అమరావతిలో కొనసాగుతున్న వరద నిర్వహణ పనులను కార్తీక్ పరిశీలించారు. పాల వాగు, పేరమ్మ వాగు అభివృద్ధి పనుల పురోగతిని APCRDA, ADCL ఇంజినీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. పరిశీలన అనంతరం పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పెనుమాక LPS యూనిట్ కార్యాలయాన్ని కార్తీక్ సందర్శించారు. స్థానికులు, రైతులు తెలియయజేసిన పలు సమస్యలపై ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు వెల్లడించిన పలు సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News