Breaking News

సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార దిశగా చర్యలు, క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి – మేయర్ రాయన భాగ్యలక్ష్మి

-స్పందనలో 14 అర్జీలు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, అధికారుల‌తో క‌లిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగరపాలక సంస్థ కు సంబందించి పలు సమస్యలపై ప్రజల నుండి 14 ఆర్జీల‌ను స్వీక‌రించారు.
సమస్యలను అర్జీలు పరిశీలించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 3, పట్టణ ప్రణాళిక – 1, జోనల్ కమిషనర్ – 1, పబ్లిక్ హెల్త్ – 3, యు.సి.డి విభాగం – 5, ఎడ్యుకేషన్ విభాగం – 1 మొత్తం 14 అర్జీలు స్వీక‌రించుట జరిగింది.
కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో 5 అర్జీలు స్వికరించిన జోనల్ కమిషనర్లు.
జోనల్ కమిషనర్లు అద్వర్యంలో సర్కిల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక – 1, రెవిన్యూ – 1, సర్కిల్ – 2 కార్యాలయంలో – ఉద్యానవన విభాగం – 1, ఇంజనీరింగ్ సంబందించి -2 అర్జీలు అందించారు. మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత రహదారులతో పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *