Breaking News

సి‌ఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో శనివారం జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో స్కిల్ దునియా, APNRT, PVP స్టాఫింగ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్నో టాస్క్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 5 కంపెనీలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు 44 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో APNRT సంస్థకు 22, PVP స్టాఫింగ్ 5, ముత్తూట్ ఫైనాన్స్ 1, టెక్నో టాస్క్ 5 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

కార్యక్రమంలో APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు, డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు, సీనియర్ లైవ్‌లీహుడ్ ఆఫీసర్ శంకర్, జూనియర్ లైవ్‌లీహుడ్ స్పెషలిస్టు క్రాంతికుమార్, CRDA విలేజ్ ఫెసిలిటేటర్లు పాల్గొని కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అభ్యర్ధుల సౌకర్యార్ధం సిబ్బందిని నియమించి రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూల నిర్వహణ ప్రక్రియను సాఫీగా నిర్వహించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *