Breaking News

ఉండవల్లిలో రహదారులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ శనివారం ఉదయం రాజధాని అమరావతి- ఉండవల్లిలో పర్యటించారు. గ్రామంలోని మూల మలుపుల వద్ద రహదారి విస్తరించేందుకు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో..APCRDA సమాయత్తమైంది. ఈ ప్రణాళికల అమలుకై గ్రామంలో రహదారికి సమీపంగా ఉన్న పలు స్థలాలు, నివాస గృహాలను కార్తీక్, CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ తో కలసి పరిశీలించారు. గ్రామంలో పర్యటిస్తున్న అడిషనల్ కమిషనర్ వద్దకు పలువురు గ్రామస్తులు, రైతులు వచ్చి వారి సమస్యలను తెలియజేశారు. ఉండవల్లి గ్రామానికి సంబంధించి స్థానికులు వెల్లడించిన ఆయా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *