-లోకేష్ తరహా లో ఎంపీ చిన్ని కొత్త ట్రెండ్
-కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త బాట
-ప్రతి రోజు నాయకులు కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం
-వత్సవాయి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎంపీ చిన్ని ఆత్మీయ విందు
-క్యాడర్ తో కలిసి మెలిసి సహాపంక్తి భోజనం చేసిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యే తాతయ్య
-72 నాయకలు కార్యకర్తల తో మందితో ఏక కాలం లోనే భేటీ
-ఇంటికి పిలిచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకుడు ఎంపీ చిన్ని నే అంటున్న కార్యకర్తలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రతినిధిగా రెండేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్టీ కేడర్‌తో తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గత రెండేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తల సమస్యలు ఇలా అనేక విషయాలు పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై ఆరా తీసిన ఎంపీ చిన్ని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి అర్హుడికి చేరేలా క్షేత్రస్థాయిలో మరింత చొరవ చూపాలని నేతలకు సూచించారు.
పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎంపీ చిన్ని, “తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ… లక్షలాది కార్యకర్తల కుటుంబం అనీ వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. అసంతృప్తితో ఉన్న నాయకులను సైతం కలుపుకొని వెళ్లడం ద్వారానే పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు.
సమావేశంలో ప్రతి నాయకుడితో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, సమస్యలను ఓపికగా వినడం ద్వారా ఎంపీ చిన్ని కేడర్‌కు మరింత చేరువయ్యారు. అనంతరం కార్యకర్తలు, మండల నేతలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొని అందరితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు.
ఎంపీ హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా సాధారణ కార్యకర్తలా అందరితో కలిసిపోవడం, కేడర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కార్యకర్తలను ఆకట్టుకుంది.“పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి, వారి మధ్యే ఉంటూ నడిపించే నాయకత్వం ఎంపీ చిన్ని సొంతం. కేడర్‌కు భరోసా కల్పిస్తూ, అభివృద్ధి-కార్యకర్తల సంక్షేమం అనే రెండు చక్రాలతో ముందుకు సాగుతున్న ఆయన తీరు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
సమావేశంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ రాజగోపాల్ (తాతయ్య) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎంపీ కేశినేని చిన్ని నిరంతరం కేడర్‌తో మమేకమవుతూ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతోందన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలంఅనీ వారి సంక్షేమం, వారి గౌరవమే మనందరి ప్రాధాన్యత” అని పేర్కొన్నారు.
అలాగే, ఎంపీ చిన్ని నాయకత్వంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, నాయకులు-కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వత్సవాయి మండల నేతలతో జరిగిన ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు దిశానిర్దేశం చేసిన కీలక సమావేశంగా నిలిచిందని కార్యకర్తలు పేర్కొన్నారు. కేడర్‌తో కలిసి నడుస్తూ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎంపీ కేశినేని చిన్ని తీసుకుంటున్న చొరవకు టీడీపీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Prajavartha Online Telugu News