– రేపు రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలను జయప్రదం చేయాలి
– సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారీ భారం మోపుతోందని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విమర్శించారు. గత 90 రోజుల్లో గృహ వినియోగ గ్యాస్ ధరను రూ.89 పెంచారని, అలాగే 11 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
కమర్షియల్ గ్యాస్ ధరను దేశ చరిత్రలోనే అత్యధికంగా రూ.990 వరకు పెంచి చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజలపై భారాన్ని మోపారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు పెంచుతున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో ప్రజలపై రూ.30 లక్షల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.30, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వరకు పన్నులు విధిస్తూ మొత్తం రూ.50 వరకు భారం వేస్తోందన్నారు.
సిపిఎం పశ్చిమ కార్యదర్శి బోయి సత్తి బాబు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ఆయన, ఈ నెల 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడియ్య, ఎం.సి.పి.ఐ.యు నాయకులు ఎస్కే ఖాదర్ భాషా లు పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మోకా దుర్గారావు,బొర్రా రామకృష్ణ,తిప్పా బత్తుల వెంకటేశ్వరరావు,గాడి రాము, మాజీ కార్పొరేటర్ గాది ఆదిలక్ష్మి, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్, నాయకులు సీరం రవికుమార్, బోరా చాముండేశ్వరి, షైనీ, ఎం సిపిఐ (యు) నాయకులు కాసాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News