విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో కాంపాక్ట్ బ్లాక్‌లో 10 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (Pre-Monsoon Dry Sowing) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పంట అయిన బొప్పాయి తోటల్లో 2 ఎకరాల ప్రీ మొన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పంటల వైవిధ్యాన్ని పెంచుతున్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా పంటలను ముందుగానే విత్తడం ద్వారా రైతులు పంటల నిలకడను సాధిస్తున్నారు. PMDS విధానంలో ఒకే పొలంలో అనేక రకాల పంటలు వేయడం ద్వారా మట్టి ఆరోగ్యం మెరుగుపడడం, నీటి వినియోగం తగ్గడం మరియు స్థిరమైన ఆదాయం పొందడం సాధ్యమవుతోంది.
అదేవిధంగా విత్తన గుళికలు (Seed Pelletization) తయారీ ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడం, ఎండలకు తట్టుకునే శక్తి పెరగడం మరియు పంటల పెరుగుదల మెరుగుపడుతోంది. ఈ విధానం ఎల్‌నినో ప్రభావ సమయంలో రైతులకు భద్రత కల్పించే ముఖ్యమైన చర్యగా నిలుస్తోంది.
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి వి.నాగ ప్రమీల రాణి, రైతులకు అవగాహన కల్పిస్తూ PMDS, విత్తన గుళికలు మరియు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాము అని తెలిపారు.రైతులు ఈ పద్ధతులను స్వీకరించి స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయం వైపు ముందడుగు వేస్తున్నారు. ఈ కార్యక్రమం లో RSK సిబంది,రైతులు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాలుగొన్నారు.
Prajavartha Online Telugu News