విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
(తల్లికి వందనం పథకం ఎస్.సి కులములకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులు జూన్, 11 వ తేదీలోపు నూతన బ్యాంకు ఖాతా ఓపెన్ చేయుట మరియు NPCI పోర్టల్ నందు అనుసంధానం చేయించుట కొనుట.)
తల్లికి వందనం పథకం క్రింద లబ్ది పొందుటకు 2026-2027 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొంది, అర్హత కలిగిన (ఎస్.సి ) షెడ్యూల్డు కులములకు చెందిన విద్యార్థులు తమ పేరుతో నూతనముగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి, దానికి ఎన్.పి.సి.ఐ (NPCI) పోర్టల్ నందు అనుసంధానము చేయు ( లింకింగ్) ప్రక్రియను ఈనెల జూన్ 11వ తేదీ లోపు పూర్తి చేయాలనీ జిల్లా ఎస్.సి సంక్షేమ సాధికారిత అధికారి కె.ఎల్. హర్షిత జిల్లాలోని విద్యార్థిని/ విద్యార్థులందరకు పత్రిక ప్రకటన ద్వారా తెలియపరచుట జరిగినది. నూతన బ్యాంకు ఖాతాను ప్రారంభించుటకు గాను విద్యార్థులు పాన్ కార్డు అవసరం లేకుండా ఆధార్ కార్డు , ఆధార్ నెంబర్ కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా వారి గ్రామా సమీపములో గల స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు మరియు కెనరా బ్యాంకులలో కొత్త బ్యాంకు ఖాతాను తెరవవచ్చును అని తెలియపరచుట జరిగినది. అందువలన తల్లికి వందనం పొందుటకు గాను జిల్లాలో మొదటి విద్యా సంవత్సరం చదువుచున్న మరియు అర్హత కలిగిన (ఎస్.సి) షెడ్యూల్డు కులములకు చెందిన విద్యార్థులందరూ మరియు వారి తల్లిదండ్రులు వారి సమీపము లో గల స్వర్ణ గ్రామా/స్వర్ణ వార్డు సచివాలయాలను సంప్రదించి గ్రామా, వార్డు సంక్షేమ మరియు విద్యా సిబ్బంది ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని గడువు తేదిలోపు ” విద్యార్థుల పేరిట నూతనముగా బ్యాంకు ఖాతా ను ప్రారంభించి, దానికి ఎన్.పి.సి.ఐ (NPCI) పోర్టల్ నందు అనుసంధానము చేయు (లింకింగ్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని” జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వారు తెలియపరచటమైనది.
Prajavartha Online Telugu News