Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్ గా తయారు చేయాలన్నదే సీయం వైఎస్.జగన్నోహన్ రెడ్డి లక్ష్యం..

-రూ. కోటి రూపాయలతో మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించిన
-రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)..
-యంపీ బాలశౌరి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి గ్లోబల్ స్టూడెంట్ గా తయారు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్నోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు.
స్థానిక రాజేంద్రనగర్ ముసిపల్ ఇంగ్లీషు మీడియం ప్రాధమిక పాఠశాల(పార్కస్కూల్)లో రూ. కోటి రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పునులను బందురు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా రాణించాన్నదే సీయం జగన్మోహన్ రెడ్డి ప్రధాన కోరిక అన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలలను నాడు-నేడు ద్వారా కార్పోరేట్ స్థాయిలో ఆదునీకరిస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. రూ. కోటి రూపాయలతో రెండు అంతస్తుల సామర్థ్యం గల అదనపు భవనాన్ని పార్కు స్కూల్లో నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు యంపీ బాలశౌరి చోరవతో కంటైనర్ కార్పోరేషన్ న్యూఢిల్లీ వారి ద్వారా సీఎస్ఆర్ ఫండ్క్ మంజూరు అయ్యాయన్నారు. మరో కోటి రూపాయలతో స్థానిక గాంధిస్కూలు సమీపంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో కూడా అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రెండు భవనాలకు సంబందించి ప్రస్తుతం రూ.12.5 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయన్నారు. గ్రౌండ్ ప్లోర్ లో 2 అడిషినల్ క్లాస్ రూములు, సైన్స్ ల్యాబ్, మరియు ఇండోర్ ప్లే గ్రౌండ్, 2 టాయిలెట్స్, మొదటి అంతస్తులో 4 క్లాస్ రూములు, లైబ్రరీ, 2 టాయిలెట్స్, రెండవ ప్లోర్ లో 4 క్లాస్ రూమ్ లు ఒక డిజిటల్ లైబ్రరీ, 2 టాయిలెట్స్ నిర్మిస్తున్నామన్నారు. పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీర్లుకు సూచించామన్నారు.
బందరు శాసనసభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విద్యార్థులకు అనువుగా,సౌకర్యంగా ఉండే విధంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు పాఠశాల అదనపు భవన నిర్మాణంలో వారి సహకారం అందించాలన్నారు. పాఠశాల అదనపు భవన నిర్మాణానికి కావలసిన నిధులను ఏమాత్రం ఆలస్యం లేకుండా అందించడం జరుగుతుందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని యంపీ బాలశౌరి మున్సిపల్ ఇంజనీర్లును ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమీటీ సభ్యులతో మాట్లాడి వారు పాఠశాల అభివృద్ది కృషి చేస్తున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేంద్ర నగర్ లో నిర్మాణంలో ఉన్న డిఎస్పీ భవనాన్ని మంత్రి కొడాలి నాని, యంపీ బాలశౌరి పరిశీలించారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, మున్సిపల్ ఈఈ శేఖర్, డీఈ ప్రవీణ్, డిఎస్పీ సత్యానందం, పేరేంట్స్ కమీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతి, తిరువణ్ణామలై రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీలు గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *