Breaking News

రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

పిడుగులతో కూడిన వర్షాలు

కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

ఎండతీవ్రత, వడగాల్పులు

మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, విజయనగరం 13, మన్యం 6, అల్లూరి 2, పోలవరం 8, కాకినాడ 8,పశ్చిమగోదావరి 2, ఏలూరు 1, కృష్ణా 3, ప్రకాశం 1, అనంతపురం 1, చిత్తూరు 1 మొత్తంగా 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/6a911e33dff3931739782459f61b317a.pdf

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40- 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

ఆదివారం ప్రకాశం జిల్లా కారేడులో 43.5 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం,కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.2, పల్నాడుజిల్లా పిడుగురాళ్లలో 43.1, కోనసీమ జిల్లా రామచంద్రాపురం, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా పాండ్రపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 42.6, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *