Breaking News

పట్టణ ప్రజలు నివశించే ప్రాంతాల్లోనే వైద్య సేవలు అందించేందుకే వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు..

-రూ.1.60కోట్లతో రెండు అర్బన్ హెల్త్ క్లినిక్ లకు శంకుస్థాపన…
-పది బెడ్స్ అందుబాటులో ఉండే విదంగా అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తున్నాం…
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
-బందురు యంపీ బాలశౌరి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణ ప్రజలకు వారు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే దిశగా వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోనికి తెస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు.
సోమవారం స్థానిక 29 వ వార్డు ధనియాల పేట, 19 స్లాటర్ పేటకు సంబందించి చెంచుకాలనిలో ఒక్కొక్కటీ రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు వైఎస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలకు మంత్రి కొడాలి నాని, బందరు ఎంపీ బాలశౌరి, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పురపాలక సంఘం పరిధిలో బాపూజీ నగర్, బేతవోలులో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా గుడివాడ పట్టణంలో మరో మూడు వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఆయా ప్రాంతాల్లో వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఈరోజు ధనియాల పేట, స్లాటర్ పేట లలో అర్బన్ పీహెచ్ సీకి శంకుస్థాపన చేశామన్నారు. బాపూజీ నగర్, ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ ఆరోగ్య కేంద్రాలు ఆధునీకీకరణకు గాను ఒక్కో హీహెచ్ సీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని త్వరలో ఆధునీకీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందేందుకు మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాలకు వైద్యం కొరకు వెళ్లే పరిస్థితి ఉందని, వైద్య సేవలు అర్బన్ పీహెచ్సీ లోనే అందే విధంగా ప్రతి వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలో పది బెడ్స్ తో అత్యవసర వైద్య సేవలకు అందించేందుకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. వైద్య సకాలంలో అందించే విధంగా అన్ని అర్బన్ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులను, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందన్నారు.
బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. ఈ మేరకు వెయ్యి రూపాయాలు దాయిన ప్రతి జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదవానికి ఆరోగ్య భరోసాను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నేడు వైఎస్సార్ అర్భన్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి, సుహాషిని, ఈఈ శేఖర్, డీఈ ప్రవీణ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభషణ్, స్థానిక నాయకులు పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, వైద్యులు డా. సతీష్, డా. విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *