-నగర ప్రజలకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నగర పరిధిలోని కందుకూరు కళ్యాణ మండపం, బర్మ్ పార్క్ ప్రాంతం మరియు అంబేద్కర్ స్మృతి వనం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు బిర్వహించారు.
ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో కామన్ యోగ ప్రోటోకాల్ లో పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించడం, యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
అలాగే, ప్రభుత్వం నిర్వహిస్తున్న “యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026” కార్యక్రమంలో నగర ప్రజలందరూ అధిక సంఖ్యలో నమోదు చేసుకొని పాల్గొనాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత యోగా శిక్షణ, రెండు వారాల ప్రత్యేక ప్రాక్టీస్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అన్ని వయస్సుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026 కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఈ
యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026 నమోదు పోర్టల్ (https://yogandhra.ap.gov.in/?utm_source=chatgpt.com#/home/yoga-registration2026) లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
నమోదు అనంతరం శిక్షణ కేంద్రం, తేదీ మరియు సమయ వివరాలు సంబంధిత అభ్యర్థుల మొబైల్ ఫోన్‌కు SMS ద్వారా వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News