కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా వారి దర్గాను సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే ప్యానల్ కౌన్సిల్ సభ్యులు చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ఈరోజు షా బుఖారి బాబా సందర్శించారు. దర్గాకు విచ్చేసిన ఆయనకు షా బుఖారి లంగర్ ఖానా నిర్వాహకులు మొహమ్మద్ అల్తాఫ్ బాబా ఘనస్వాగతం పలికారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన దర్గాలో బాబా వారికి భక్తిశ్రద్ధలతో చాదర్, పూలు, చందనం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా బాబా ప్రత్యేక ‘దువా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుమామిళ్ల క్రాంతి కుమార్ గారు సమీప భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, సుప్రీం కోర్టులో అత్యున్నత స్థానాన్ని అలంకరించాలని ఆకాంక్షిస్తూ, అందుకు బాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు కోరుకున్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, దర్గా నిర్వాహకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News