Breaking News

75 ఏళ్ల వృద్ధాప్యం . . పైగా నిస్సహాయ స్థితి

-దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ ను కలిసి ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించిన వృద్ధురాలు
-వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించి బిటిఆర్ కాలనీ రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వేంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 75 సం. ల వయసు గల శారదమ్మ దిక్కు తోచని స్థితిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్ ను కలసి ఆశ్రయం కల్పించాలని కోరగా వెనువెంటనే మానవతా దృక్పథంతో స్పందించి జిల్లా కలెక్టర్ ఆమెకు ఆశ్రయం కల్పించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పి.శారదమ్మ తన భర్తతో కలసి బళ్ళారి పట్టణంలోని ఆలయ పరిసరాల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం గడుపుకునే వారు. వృద్ధ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శారదమ్మ తన భర్త మరణించిన అనంతరం జీవనోపాధి లేక ఒంటరిగా మిగిలిపోయింది. దిక్కు తోచని స్థితిలో శ్రీ వేంకటేశ్వర స్వామే దిక్కని తలచి తిరుపతి పట్టణం చేరుకుంది. వృద్ధురాలి దయనీయ స్థితిని చూసిన పలువురు స్థానికులు జిల్లా కలెక్టర్ ను కలసి తన పరిస్థితిని వివరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ను కలిసిన వృద్ధురాలు తన భర్త మరణానంతరం తన ఇద్దరు పిల్లలు తనకు ఆశ్రయం కల్పించలేదని, దుర్భర పరిస్థితిలో తిరుపతి చేరుకున్నానని తెలిపింది. అనంతరం తిరుపతిలోని పలు వృద్ధాశ్రమాలను ఆశ్రయించగా తనకు ఆశ్రయం కల్పించడానికి వృద్ధాశ్రమాలు తిరస్కరించాయని తెలిపారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ్మి వచ్చానని, పేద ప్రజల కష్టానికి చలించే జిల్లా కలెక్టర్ ఉన్నారని స్థానిక ప్రజల సూచనలతో తిరుపతి జిల్లా సచివాలయానికి చేరుకున్నానని, తనకు ఆశ్రయం కల్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆమె విన్నవించుకున్నది. వృద్ధురాలి నిస్సహాయ పరిస్థితి, కన్నీటిని చూసిన జిల్లా కలెక్టర్ చలించి మానవతా దృక్పథంతో సహాయక చర్యలకు పూనుకున్నారు. వెంటనే బీ.టి.ఆర్. కాలనీలో ఉన్న రాష్ట్రీయ సేవా సమితి ప్రతినిధులను సంప్రదించి వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించి ఆశ్రయం, వైద్యం, అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టాలని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. జల్లా కలెక్టర్ ఆదేశాలతో తక్షణమే వృద్ధురాలిని రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో చేర్పించే ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలు తన పరిస్థితికి చలించి తనకు ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్ కు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. వృద్ధులు మరియు నిరాశ్రయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *