Breaking News

నాలుగు రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు సమక్రమమే : రిటర్నింగ్ అధికారి వణితా రాణి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యసభ ఎంపి ఎన్నికలకు సంబంధించి నలుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వణితా రాణి వెల్లడించారు.మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది.రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా తెలుగుదేశం పార్టీ తరుపున చింతకాయల విజయ్,బాష్యం రామకృష్ణ,సానా సతీష్,జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ లు దాఖలు చేసిన నామినేష్లను సమక్రమంగా ఉండడంతో పరిశీలన అనంతరం నలుగురు అభ్యర్దుల నామినేషన్లను ఆమోదించినట్టు ఆమె వెల్లడించారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.ఈనామినేషన్ల పరిశీలనలో ఆయా అభ్యర్థుల తరుపున వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *