Breaking News

జూన్ 18, 19 తేదీల్లో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమీక్ష సమావేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (Committee on Public Undertakings) సమావేశాలు ఈ నెల 18 మరియు 19 తేదీలలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయ కమిటీ హాల్-1 లో నిర్వహించనున్నట్లు శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమావేశంలో సంబంధిత అథారిటీలు, కార్పొరేషన్ల స్థాపన లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు–అప్పులు, సంస్థల కార్యకలాపాలు, సాధించిన విజయాలు, సిబ్బంది వివరాలు, ఖాళీలు, రోస్టర్ అమలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రైవేట్ భాగస్వామ్య విధానాలు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ, ఖాతాల నిర్వహణ, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం, స్వయంప్రతిపత్తి, పనితీరు, సామర్థ్య పెంపు చర్యలు, CSR నిధుల వినియోగం మరియు ఈ-ఆఫీస్ అమలు పరిస్థితులపై కూడా కమిటీ పరిశీలన చేయనుంది.

జూన్ 18, 2026 (గురువారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించే సమావేశంలో వ్యవసాయం, పట్టు పరిశ్రమ, సహకార రంగం, రైతు సంక్షేమం, పశుసంవర్థక, మత్స్య, వెటర్నరీ మరియు సామాజిక సంక్షేమ రంగాలకు సంబంధించిన సంస్థలను సమీక్షించనున్నారు. వీటిలో ఏపీ స్టేట్ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, SERIFED, రైతు సాధికార సంస్థ, స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, APCARL, ఏపీ స్టేట్ ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్, ఏపీ వెటర్నరీ కౌన్సిల్, ఏపీ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ వంటి సంస్థలు ఉన్నాయి.

జూన్ 19, 2026 (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించే సమావేశంలో ఏపీ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, ఎంజేపీఏపీబీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP), ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సంస్థల కార్యకలాపాలు, ఆర్థిక మరియు పరిపాలనా అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *