Breaking News

5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు

-రోజురోజుకి పెరుగుతోన్న ఔత్సాహికులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్లు ఐదు లక్షలకు చేరుకున్నాయి. ఈ నెల 7 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా 3 రోజుల వ్యవధిలోనే ఐదు లక్షలకు చేరుకోవడం విశేషం. తొలిరోజు 25వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సోమవారం నుంచి ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలని సీఎం శ్రీ చంద్రబాబు జారీచేసిన ఆదేశాలు అనుసరించి యోగాంధ్ర పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తోన్న సానుకూల వాతావరణం ప్రకారం త్వరలోనే కోటి మంది పేర్లు యోగాంధ్ర పోర్టల్ లో నమోదు కాబోతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది పేర్లు నమోదయ్యాయని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగా అసోసియేషన్ల ద్వారా, గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా, ఇతర మద్దతుల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

లక్ష్యానికి మించి యోగా మాస్టర్ ట్రైనర్ల పేర్లు నమోదు!

యోగాంధ్ర కార్యక్రమానికి యోగా మాస్టర్ ట్రైనర్లలో 5,600 మంది పేర్లు నమోదు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సంఖ్య ఇప్పటికే 6,939కు చేరుకోవడం గమనార్హం. వైఎస్సార్ కడప జిల్లాలో 412, అనకాపల్లి-379, అనంతపురం-342, కర్నూలు జిల్లాలో 310 మంది యోగా మాస్టర్ ట్రైనర్ల పేర్లు యోగాంధ్ర పోర్టల్ లో నమోదయ్యాయి. వాస్తవానికి ప్రతి జిల్లాకు 200 మంది చొప్పున పేర్లు నమోదుచేయించాలని ప్రభుత్వం జిల్లాలకు సూచించింది. మరోవైపు యోగా ట్రైనర్ల కేటగిరిలో 2.5 లక్షల మందిని చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 1.88 లక్షల మంది పేర్లు యోగాంధ్ర పోర్టల్ లో నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 9,013 మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వం ఖరారుచేసిన ప్రణాళికలు అనుసరించి జిల్లాల్లో యోగాసనాల కార్యక్రమాలు, థీమ్ బేస్డ్, రకరకాల పోటీలు, ఇతర కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *