Breaking News

ఆన్ లైన్ లో ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్

-రూరల్ అన్న క్యాంటీన్లనూ సమర్థవంతంగా నిర్వహించాలి
-ప్రతిరోజూ తాగునీటి శాంపిళ్లు తీయాలి
-ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మన మిత్ర ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్ లైన్ లో వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని.. దీంతో పాటు ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ప్రభుత్వం అందించే అన్ని సేవలను ఆన్ లైన్ చేశాం. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆన్ లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇదే సందర్భంలో ఆన్ లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా యాప్ రూపొందించాలి. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలి. అర్బన్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల సేవలను ఏ విధంగా అందిస్తున్నారో… రూరల్ ప్రాంతాల్లోని అన్న క్యాంటీన్లల్లోనూ అదే స్థాయిలో సేవలు అందించాలి. ప్రజలకు అందే తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీటి కాలుష్యం అనేది ఉండకూడదు. తాగునీటిలో ఎలాంటి మలినాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజూ తాగునీటి శాంపిళ్లు తీయాలి. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపొద్దు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్ అండ్ గ్రీన్ తరహా కార్యక్రమాలను విజయవంతం చేయగలం. ప్రకృతి పట్ల, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలి. జలధార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమం ఫలితాలు కన్పించాలి. చెరువులను సిద్దం చేసుకోవాలి. వర్షాకాలంలో చెరువులన్నీ నిండేలా చూడాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. ప్రతి కుంటనూ, ప్రతి చెరువునూ ఆన్ లైన్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేలా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించుకునేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీని కోసం టెక్నాలజీని వినియోగించాలి. ఈ మేరకు అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టును పరిశీలించాలి. గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలి. గంజాయి సాగు, రవాణ, అమ్మకం, వినియోగం అనేది ఎక్కడా కన్పించకూడదు. మహిళలపై నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి… వివిధ నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయి… శిక్షలు పడిన వారికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేయాలి. మహిళలపై నేరాలు చేయాలంటే భయపడేలా ప్రచారం చేపట్టాలి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. పరిపాలనలో నూతన విధానాల అమలుపై కేంద్రం ఆసక్తి చూపిస్తోంది. సుపరిపాలన లో భాగంగా రాష్ట్రంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టాం. అధికారులు, ఉద్యోగులకు పనితీరును మెరుగు పరిచేలా ఓరియేంటేషన్ ఇస్తున్నాం. టెక్నాలజీని వినియోగించుకుని పరిపాలనలో కొత్త పద్దతులను అమలు చేస్తున్నాం. టెక్నాలజీ డ్రివెన్ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థలతో పరిపాలనలో కొత్త విధానాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కేంద్రం ఈ తరహా పద్దతులను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. వీటిని ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రజెంట్ చేద్దాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *