కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 వేలు చెల్లింపు… : జిల్లా కలెక్టర్ జె. నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ -19 వలన మృతి చెందిన వ్యక్తులకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం గత నెల 27 వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు చెల్లించే ఈ పరిహారం కోసం నిర్దేశించిన ధరఖాస్తుతో పాటు సంబంధిత జనన మరణ రిజిష్టరు కార్యాలయం నుండి జారి చేయబడిన చనిపోయిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం, చనిపోయిన వ్యక్తి, వారి కుటుంబసభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికేట్, ధరఖాస్తుదారుని సంబంధించిన బ్యాంకు అకౌంట్ నకలు కాపి, కరోనా టెస్టు రిపోర్టు నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పించవచ్చని ఆ ప్రకటనలో కలెక్టర్ స్పష్టం చేశారు. ధరఖాస్తు సమర్పణ నిమిత్తం సిడాక్ ధృవీకరణ కోసం వేచి చూడకుండా ముందుగానే ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్థిక సహాయం కోసం నిర్ణీత ధరఖాస్తును సంబంధిత మిగిలిన ధృవీకరణ పత్రాలను జత పరచి కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో అందజేయాలన్నారు. సంబంధిత ధరఖాస్తులు ఇచ్చి అది ముట్టినట్లుగా తిరుగు రసీదు పొందలన్నారు. ధరఖాస్తు ఫారాలు తహాశీల్దార్, మున్సిపల్, ఆర్డీవో కార్యాలయాల నందు లభ్యమవుతాయన్నారు. కోవిడ్. మూలంగా చనిపోయి తల్లిదండ్రులు పిల్లలకు ఆర్ధిక సహాయం పొందిన వారు, వైద్యసేవలు చేస్తూ కరోనా బారిన పడి మరణించిన వారి యొక్క కుటుంబసభ్యులు ఆర్థిక సహాయం పొందిన వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా, చనిపోయిన తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలకి ఆర్ధిక సహాయం పొందిన వారు, వైద్య సేవలు చేస్తూ కరోనా బారిన పడి మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం పొందిన వారికి ఈ పథకం వర్తించదని ఆయన తెలిపారు. పై విషయముల గురించి ఎటువంటి సందేహలు నివృత్తి కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో జిల్లా రెవిన్యూ అధికారి వారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విభాగము లోని సెల్ నెం: 9908664635 ను సంప్రదించవలసినదిగా తెలియచేయదమైనదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *