విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లకు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ డాక్టర్ జె.అరుణ సమక్షంలో సోమవారం ఆమె ఛాంబర్ నందు కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు కల్పించడం జరిగింది. నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా పదోన్నతి పొందిన వారికీ ఉత్తర్వులు అందించారు. పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరు భాద్యత గా పనిచేసి నగరపాలక సంస్థ పాఠశాలలకు మరియు విజయవాడ నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి, విద్యార్థుల యొక్క అభివృద్ధి కి దోహదపడాలని చక్కటి విద్యా భోధన అందించాలని సూచించారు. పదోన్నతి పొందిన వారిలో CVR MCH పాఠశాల కు T. కుమార్ రెడ్డి, APJ Abdul kalam ఉర్దూ పాఠశాలకు V. మధుసూధనరావు, APSRMCHS కు S. రమేష్, GNR MCHS పాఠశాలకు M. శ్రీనివాసరావు laku కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాలల సూపర్ వైజర్లు షేక్ సైదాసాహెబ్, మహమ్మద్ హుస్సేన్ సీనియర్ ప్రధానోపాధ్యాయులు షేక్ ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News