విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టరు(అభివృద్ది)క్యాంపు కార్యాలంయంలో మంగళవారం గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమాల వివరాల బ్రోచర్ ను గ్రందాలయ అధికారులు,సిబ్బందితో కలసి జాయింట్ కలెక్టరు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ, ఠాగూర్ స్మారక గ్రంధాలయం ఆధ్వర్యంలో నిర్వహిచే వారోత్సవాల్లో పుస్తక ప్రియుల్ని గ్రంథాలయాలకు చేరువ చేసి, వారిలో పఠనాసక్తిని పెంపొందింపజేసేందుకు ఈ వారోత్సవాలు ఎంతో దోహద పడతాయన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి (ఎఫ్.ఏ.సి) కంచల నాగరాజు మాట్లాడుతూ – ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే గ్రంధాలయ వారోత్సవాల్ని కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ గారు ప్రారంభిస్తారన్నారు. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వివిధ సాహితి, సేవా, కళారంగా సంస్థలు, సాహితీ వేత్తలు, కళాకారులూ, చిత్రకారులు,కార్టూనిస్టులు పాల్గొంటున్నారని అన్నారు. విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను ప్రోత్సాహించేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ గ్రంధాలయ సిబ్బంది కళ్లేపల్లి మధుసూదన రాజు, అల్లూరు రామచంద్రుడు, చొప్పరపు రామకృష్ణ నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, కోశాధికారి చొప్పా రాఘవేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News