రాష్ట్రంలో తొలిసారి ఒకే పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం సంతోషకరం

-ఏపీ పీజీ ఎంట్రన్స్ – 2021 పరీక్షల్లో 76.44 శాతంతో మొత్తం 24,164 మంది అర్హత
-ఫస్ట్ ర్యాంకు సాధించిన వారిలో 60 శాతం పైగా మహిళలే.
-ఒకే ఎంట్రన్స్ పరీక్షతో రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలో అయిన ప్రవేశం పొందే అవకాశం.
-విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తొలిసారి నిర్వహించిన ఏపీ పీజీ సెట్ – 2021 ఎంట్రన్స్ పరీక్షల్లో 76.44 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో యోగి వేమన యూనివర్సిటీ నిర్వహించిన ఏపీ పీజీసెట్ – 2021 ఫలితాలను మంత్రి విడుదల చేశారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లోని, 145 పీజీ ప్రోగ్రాంలకు సంబంధించి, 53 సెంటర్లలో తొలిసారి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం సంతోషకరమన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఆన్ లైన్ ద్వారా అక్టోబర్ 22 నుంచి 26 వ తేదీ వరకు 5 రోజుల పాటు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, రెండు వారాల్లోనే ఫలితాలు వెల్లడించామని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 39,856 మంది ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా 35,573 మంది పరీక్షలకు హాజరు కాగా 24,164 మంది ఉత్తీర్ణత సాధించారని.. మొత్తంగా 76.44 శాతం మంది అర్హత సాధించారని తెలిపారు. మొత్తం అర్హత సాధించిన 24,164 మందిలో 14,162 మంది మహిళలే కావడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షల్లో 10,002 మంది పురుషులు అర్హత సాధించారని తెలిపారు. ఈ ర్యాంకుల వివరాలను ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ లో పొందుపర్చడం జరిగిందని, విద్యార్ధులు ర్యాంకు కార్డులను డౌన్ లౌడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్ధుల ర్యాంకులు, వారు ఇచ్చే ఆప్షన్లు ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారిలో 60 శాతం మంది మహిళలేన్నారు. అలాగే 16 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్ధులు టాపర్స్ గా నిలిచారంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారని, ఇందులో భాగంగా నేడు ఈ ప్రభుత్వం ఒకే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ను తీసుకురావడంతో రాష్ట్రంలోని విద్యార్ధులందరూ ఒకే ఎంట్రన్స్ పరీక్షతో, పీజీ అడ్మిషన్లు పొందే అవకాశం కలిగిందని మంత్రి తెలిపారు. గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష లేకపోవడం వల్ల, ఎవ్వరికీ వారు, పరీక్షలు నిర్వహించి, అడ్మిషన్లు చేపట్టేవారన్నారు. నేడు ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ ద్వారా విద్యార్ధులకు వ్యయ ప్రయాసలు తగ్గాయన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చని తెలిపారు.. ప్రవేశ పరీక్షలలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించామన్నారు.
తొలిసారి ఏపీ పీజీ సెట్ ను విజయవంతంగా, ఎటువంటి ఇబ్బందులు, అవకతవకలు లేకుండా లేకుండా, పారదర్శకంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొ. రామ్మోహన్ రావు, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్ పర్సన్ ఫ్రొ. లక్ష్మమ్మ, ఉన్నత విద్యామండలి సెక్రటరీ ప్రొ. సుధీర్ ప్రేమ్ కుమార్, ఏపీ పీజీ సెట్ కన్వీనర్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *