Breaking News

విద్యార్థుల్లో గల సృజనాత్మకతను పెంపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించే విధంగా విద్యాబోధన ఉండాలి…

-విద్యార్థులతో పాటు నేలపైనే కూర్చోని మధ్యాహ్నం భోజనం చేసి ఆహార నాణ్యతను గుర్తించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
-జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించే విధంగా ఉపాధ్యాయులు వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనను అందించాలని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్ అన్నారు.
కంకిపాడు మండలం ఈడుపుగల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం జాయింట్ కలెక్టరు శివశంకర్, సాంఘీక సంక్షేమ అధికారిణి సరస్వతి ఇతర అధికారులుతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయలు ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా నాణ్యమైన విద్యను బోధిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందిచాలన్నారు. ప్రతి విద్యార్థి తాను చదివిన అంశాలపై పట్టు సాధిస్తూ ఐఐటీ, ట్రిఫుల్ ఐటీ వంటి పరీక్షలతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా తమ సత్తాను చాటేవిధంగా విద్యార్థుల్లోగల ప్రతిభను వెలికి తీయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థినీ గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. ఆ మేరకు నాడు- నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తూ కార్పోరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు శివశంకర్ క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వలన గుర్తుండిపోతాయని, తద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి బట్టి విదానానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ కోచింగ్ విదానం, గురుకుల పాఠశాలలోని విద్యా బోధన నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు విద్యార్థులతో పాటు నేలపైనే కూర్చోని మధ్యాహ్నం భోజనం స్వీకరించి ఆహార నాణ్యత, రుచిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల లైబ్రరీని సందర్శించి ఏయే పుస్తకాలు ఉన్నవీ విద్యార్థులు ఏవిధంగా లైబ్రరీనీ వినియోగించుకుంటున్నారో లైబ్రరీ ఇన్చార్జిని అడిగి తెలుసుకున్నారు. తొలుత జాయింట్ కలెక్టరు శివశంకర్ కు విద్యార్థులు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి సరస్వతి, ఏపీ గురుకుల పాఠశాలల అడిషినల్ సెక్రటిరీ సంజీవరావు, తాహశీల్థారు సతీష్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్ర సంకల్పం చేశా…

-అంతా సంకల్పిస్తేనే దేశం, రాష్ట్రం, గ్రామం అభివృద్ధి -దేశ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యమే కీలకం -పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *