Breaking News

19న కార్తీక పౌర్ణమి రోజున గిరిప్రదక్షణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
గత సంవత్సరము కార్తీక మాసము లో కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభించబడిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరిప్రదక్షిణ ఈ నెల 19 న నిర్వహించబడుచున్నది. జరగబోవు గిరిప్రదక్షిణ కార్యక్రమమునకు చేయవలసిన ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, అధ్యక్షతన సమావేశము ఏర్పాటు చేసియున్నారు. సదరు సమావేశము నందు దేవస్థాన కార్యనిర్వహణాధికారిని భ్రమరాంబ , కార్యనిర్వహక ఇంజనీరు, వైదిక కమిటీ సభ్యులు, పోలీసు శాఖ వారు, విజయవాడ మునిసిపల్ కార్పేరేషన్ వారు, డీ ఎం అండ్ హెచ్ వారు సమావేశమునకు హాజరయి ఏర్పాట్లపై చర్చించుట జరిగినది. గిరిప్రదక్షిణ నిర్వహించుటకు దేవస్థానమునకు అనుమతించియున్నారు.
గిరిప్రదక్షిణ ఈనెల 19న ఉదయం 6 గం.లకు మహామండపము నుండి భక్తులతో ఊరేగింపుగా బయలు దేరి కుమ్మరిపాలెం సెంటరు, నాలుగుస్తంబాలు సెంటర్, సితార సెంటర్, కబేళా, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, శ్రీనివాస మహల్ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి దేవస్థానమునకు చేరుకొందురు. ఈ గిరి ప్రదక్షిణ దూరము సుమారు 8 కి.మీ ఉండును. గిరి ప్రదక్షిణ చేయుటకు గాను రెండున్నర నుండి 3 గం.ల సమయము పట్టును. ఈ గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రధముతో పాటు భక్తుల సౌకర్యార్థం నడవలేని భక్తులకు మిని బస్సు, మూడు ప్రదేశములలో విశ్రాంతి తీసుకొనుటకు, స్టాల్సు, త్రాగునీరు, ఉచిత ప్రసాదం, మైకు ద్వారా ప్రచారము, మెడికల్ క్యాంపులు -3, అంబులెన్సులు-2 మరియు ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడును. గిరిప్రదక్షిణ లో పాల్గొను భక్తులు యావన్మంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణముగా హ్యాండ్ సానిటైజర్ ఉపయోగిస్తూ మాస్కులు ధరిస్తూ తగు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనవలసినదిగా మరి మరి కోరుడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేయుట వలన భక్తుల కోరికలు తీరుటయేగాక, ముక్తి, మోక్షము కలుగును. యావన్మంది భక్తులు ఈ కార్యక్రమము నందు పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కృపకు పాతృలు కాగలరని కోరుచున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *