Breaking News

కోవిడ్ సమయంలో పర్యావరణహిత ఆక్సిజన్ ప్లాంట్లు

-గుంటూరు, విజయవాడల్లో ఇప్పటికే అందుబాటులో
-మిగిలిన జిల్లాలకూ విస్తరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ పాండమిక్ సమయంలో ఆక్సిజన్ అవసరాలు భారీగా పెరిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణహిత ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం వెమిరి ఇండియా ఓవర్సీస్ప్రైవేటు లిమిటెడ్ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటికే దేశంలో ఆక్సిజన్ సరఫరాలో కీలకంగా ఉన్న సంస్థ, కోవిడ్ నేపథ్యంలో మరింత ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా సమిష్ట హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మొదటి మాడ్యూల్ ను అందుకుంది. వెమిరి ప్లాంట్లు 96 శాతం శుద్ధ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. అనంతరం కొద్ది కాలంలోనే విజయవాడలో ఇండస్, సెవెన్ హిల్స్, జీఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ, హెల్ప్, కాపిటల్, లిబర్టీ, సన్ రైజ్ ఆసుపత్రులు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే గుంటూరులో వేదాంత, సమిష్ట తదితర సంస్థలు యూనిక్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా వెమిరి సంస్థ ప్రతినిధి కృష్ణ మీనన్ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావంతో భారతదేశం తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కుంటోందన్నారు. ఈ తరుణంలో ప్రధాన ఆస్పత్రులన్నీ సొంత ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత వైద్య ఆక్సిజన్, ఇతర అవసరాలను నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా తీర్చేందుకు తమ సంస్థ ముందడుగు వేసిందని వివరించారు. ఈ పరికరాలు చిన్న లోపం తలెత్తినా వెంటనే అలారం మోగించి అప్రమత్తం చేస్తాయని తెలిపారు. వెమిరి ఆక్సిజన్ ప్లాంట్లకు బ్యాంకులు తక్కువ వడ్డీతో(7.5 శాతం) రుణ సహాయాన్ని అందిస్తున్నాయని, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతి, తిరువణ్ణామలై రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీలు గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *