పాతశివాలయంలో అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూశ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం పాత శివాలయం లో ఉన్న అమ్మవారి ఆలయా ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలని, వారసత్వం లేనటువంటి వ్యక్తులను అక్రమ పద్ధతిలో ఆర్ జె సి సురేష్ బాబుకు మరియు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పది లక్షల రూపాయల ముడుపులు అందజేసి ఈ ముఖ్య అర్చక పదవిని అక్రమ మార్గంలో ఆలయ ఈవో భర్తీ చేయాలని చూస్తున్నారని, నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఆలయ ఈవో హేమలత దేవి కి లేకపోయినా గోడ మీద రెండు కాగితాలు అంటించి నోటిఫికేషన్ గా మాట్లాడుతున్నారని, నోటిఫికేషన్ జారీ చేసే అధికారం అసిస్టెంట్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్ కు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కి ఉంటుంది కానీ ఈ ఆలయ ఈఓ కు ఏమాత్రం ఉండదని, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు జయంతు సత్యనారాయణ కి వివాహం కాలేదని అందువల్ల వారికి వారసులు ఎవరూ లేరని, కానీ ఈఓ లేని వారసత్వాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూన్నారని,అందుకోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ,RJC సురేషబాబు కు 10 లక్షలు ముడుపులు చెల్లించి అక్రమ పద్దతి లో నియామకం చేయాలని చూస్తున్నారని, ముఖ్య అర్చక పదవి నియామకంలో ఆలయ.EO కి ఆంత ఉత్సాహం ఎందుకో సమాధానం చెప్పాలని, సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేసి ప్రధాన అర్చక పదవి భర్తీ చేయకపోతే ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని, న్యాయం జరగని పక్షంలో కోర్టును కూడా ఆశ్రయిస్తామని, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం 93 లక్షల రూపాయల నిధుల వినియోగంపై శ్వేత పత్రం ఆలయ ఈవో విడుదల చేయాలని, ఈ 93 లక్షల రూపాయల నిధులతో కేవలం రంగులు వేయడానికి సరిపెట్టారేమో నన్న అనుమానం కలుగుతుందన్నారు, భక్తులు ఇచ్చే విరాళాలకు సక్రమంగా రసీదులు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయని, దీనిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాలని,పాలకమండలి చైర్మన్  మరియు పాలకమండలి గుంపులుగుంపులుగా మాపై ప్రెస్ మీట్ లు పెట్టడం పై ఉన్న శ్రద్ధ ఆలయ అభివృద్ధి పైన అదేవిధంగా ముఖ్య అర్చక పదవి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయించి భర్తీ చేయడం పైన దృష్టి సారించాలని , పాలకమండలి అభివృద్ధి వైపు అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  కనకదుర్గమ్మ ఆలయంలో అందినకాడికి దోచుకున్నారని, ఇప్పుడు పాత శివాలయం లోని అమ్మవారి ఆలయం ముఖ్య అర్చక పదవికి ముడుపులు తీసుకోవడం చాలా దుర్మార్గమని, అవినీతికి కొత్త కొత్త మార్గాలు నిత్యం వెతుక్కుంటున్నారని, తన బినామీ ఈవో సురేష్ బాబు కి పదోన్నతి కల్పించి ఆర్ జేసీ చేసి ఈ నాలుగు జిల్లాల్లో ముడుపులు వారి ద్వారా అందుకుంటున్నారని, ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్న దేవాదాయశాఖ మంత్రి పై అమ్మవారు మరియు భక్తులు తగిన సమయంలో తప్పక శిక్షిస్తారని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *