-ఎంపిటిసి 6 వైకాపా, 1 స్థానంలో టిడిపి గెలుపు
-జడ్పీటీసీ 2స్థానాల్లో, వైఎస్ఆర్ సిపి,ఒక స్థానంలో టీడీపీ గెలుపు
-కౌంటింగ్ను పర్యవేక్షంచిన జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలోని 3 జడ్పీటీసీ, 7 ఎంపిటిసి ఖాళీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. ఉదయం 8 గంటలు నుంచే లెక్కింపు ప్రారంభమై, మధ్యాహ్ననానికి 7 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లాలోని మొత్తం 7 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 6 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒక చోట టిడిపి విజయం సాధించాయి. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ జె. నివాస్ పర్యవేక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ వీడియో కాన్ఫెరెన్సు హాల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు తీరును పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు కౌంటింగ్ సమాచారాన్ని తెలుసుకున్నారు. జిల్లాలో జి.కొండూరు,విస్సన్నపేట, పెడన జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జి.కొండూరు, విస్సన్నపేట జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు విజయం సాధించాగా,పెడన జడ్పీటిసి స్థానం లో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందారు. ఎంపిటిసి స్థానాలకు సంబంధించి నూజివీడు మండలం దేవరగుంట,గన్నవరం మండలం చినఅవుట పల్లి,పెనుగంచిప్రోలు మండలం కొనకంచి,ముదినేపల్లి మండలం ముదినేపల్లి-2,నాగాయలంక మండలం పరచివర,అగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ ఆర్ సిపి పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ముదినేపల్లి మండలం వనుదుర్రు యంపిటిసి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
Prajavartha Online Telugu News