మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కు శనివారం ఇద్దరు వైయస్సార్ సిపి పార్టీ అభ్యర్థుల తరఫున రెండు నామినేషన్లు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) డాక్టర్ కే.మాధవి లత వారి కార్యాలయంలో దాఖలు చేశారు.
బుద్ధా వెంకటేశ్వరరావు పదవి విరమణ తో కాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ మొండితోక అరుణ్ కుమార్ తరఫున వారి ప్రతినిధి గాదెల వెంకటేశ్వరరావు (నందిగామ జడ్పిటిసి) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, వై బాబు రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయస్సార్ సిపి పార్టీ అభ్యర్థి శ్రీ తలసిల రఘురాం తరఫున వారి ప్రతినిధి చెన్ను ప్రసన్నకుమారి (విజయవాడ రూరల్ ఎంపీపీ) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
Prajavartha Online Telugu News