-నగర పాలక సంస్థ అధనపు కమిషనర్ (జనరల్) డా.జె. అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే భాద్యత ప్రతి సచివాలయం సిబ్బందిపై ఉందని అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ పేర్కొన్నారు. శనివారం బ్రహ్మరెడ్డి నగర్ విశాలాంద్ర రోడ్ లోని 32, 33, 34 మరియు 35 సచివాలయాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సంక్షేమ పథకములకు సంబందించి పూర్తి వివరాలు విధిగా నోటీసు బోర్డులో ఉంచాలని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News