Breaking News

సోమవారం స్పందన లో 13 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు తెలియచేసారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ఈరోజు మొత్తం 13 మంది స్పందన లో పింఛను, ఇళ్ళ స్థలం, భూ సమస్య, రేషన్ కార్డు తొలగింపు పై అర్జీలు ఇచ్చారన్నారు. నిడదవోలు పరిధిలో స్థలం కోసం ఇదివరకే ఇచ్చిన ఆర్జి మరోసారి ఇచ్చారని, గతంలో ఇచ్చిన దరఖాస్తు పరిశీలనలో ఉండడంపై సంబంధించిన తహసీల్దార్ నుంచి వివరాలు తెలుసుకుని, ఆర్జి దారునికి తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

-ఉద్యోగుల నైపుణ్యాల పెంపుపై సీఎం దిశానిర్దేశం -రెండున్నరేళ్లలో గృహ నిర్మాణం లక్ష్యాల పూర్తికి కార్యాచరణ -రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *