జగనన్నసంపూర్ణగృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకొనేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…

-అధికారులు సమన్వయంతో గృహ నిర్మాణాల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి…
-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్

నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఒన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ను సద్వినియోగం చేసుకొనే విదంగా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ వాసు నుపూర్ అజయ్ కుమార్ అన్నారు.
మంగళవారం స్థానిక మండల కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ 1983 నుంచి ప్రభుత్వ రుణ సహాయంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులు గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు మండల పరిదిలో 3,376 మందిని గుర్తించామని, ఇందులో 2,780 మందిని ఆన్ లైన్ నమోదు చేయడం జరిగిందని మిగిలి వారిని కూడా త్వరిత గతిన నమోదు చేయాలన్నారు. నందివాడ మండలం ఓటీఎస్ కింద రూ. 33 లక్షలు లక్ష్యానికి గాను 45 మంది మాత్రమే చెల్లించారన్నారని, ఈ నెలాఖరు లోగా లబ్దిదారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి రుణ బకాయి ఎంత ఉన్నా రూ .10 వేల నగదును వారి పరిధిలో గల సచివాలయాల్లో జమ చేయాలన్నారు. అనంతరం వారి పేరున వారి ఇంటి డాక్యుమెంట్ రిజిష్టరు చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షిస్తూ మండలంలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు(హౌసింగ్‌) నూపూర్ అధికారులను ఆదేశించారు. నందివాడం మండలంలో 27 లేఅవుట్లలో మొత్తం 1918 ఇళ్ల స్థలాలు లబ్దిదారులకు మంజూరు కాగా ఇప్పటి వరకు 11 లే అవుట్లలో 202 ఇళ్లు బేస్ మెంట్ మరియు పై ఎత్త స్థాయిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన స్టీల్‌, సిమెంట్‌, ఇసుక లబ్ధిదారులకుతక్షణమే అందిలన్నారు. ఇళ్లు నిర్మించనున్న ప్రాంతంలో విద్యుత్తు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇంకా మెరక చేయాల్సిన లేఅవుట్లలో మెరక పనులు చేపట్టి పూర్తి చేయాల్సిందిగా అధికారును ఆదేశించారు. లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారని, చిన్నపాటి సమస్యలున్నా వాటిని త్వర గా పరిష్కరించాలని సూచనలు చేశారు.
సమావేశంలో హౌసింగ్ డీఇ రామోజీ నాయక్, మండల తాహశీల్థార్లు అబ్దుల్ రహిమాన్ మస్తాన్, యంపీడీవో విష్ణుప్రసాద్, విఆర్వోలు, మండల,గ్రామ ప్రత్యేకాధికారులు, సచివాలయ కార్యదర్సులుతదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *