నన్ను క్షమించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల ఎంపి సురేష్ మీద అభియోగాలు మోపినందుకు క్షమించమని కోరుతున్నట్లు మేకల భానుమూర్తి తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇబ్రహీంపట్నం మండలంలో నివశిస్తున్నానని, గత వారం తన కుటుంభంకు ప్రాణహాని ఉందని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎంపి సురేష్ మీద ఆరోపణలు చేశానని తెలిపారు. తనకు మానసిక పరిస్థితి బాగోలేనందున అలా చెప్పవలసి వచ్చినదని తరువాత విషయము తెలుసుకుని బాధపడ్డానని, ఎంపి నందిగం సురేష్ వలన తనకు, తన కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని లేదని విషయమంతా తెలుసుకున్నానని వివరించారు. ఎంపి నందిగం సురేష్ వల్ల తన మీద గానీ, తన తండ్రి మీద గానీ ఎక్కడ ఎటువంటి కేసులు పోలీసు వారు పెట్టలేదని తెలియజేశారు. కావున విలేకరులు ముందు ఎంపి నందిగం సురేష్ కు క్షమాపణ కోరుతున్నట్లు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *