గుడివాడ మండలంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం…

-రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం…
-మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుంకు గుడివాడ రూరల్ మండలం పరిదిలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత అన్నారు.
గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు రైతు భరోసా కేంద్రంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మోండ్రు సునీత తాహశీల్థారు శ్రీనివాసరావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడివాడ మండల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఖరీఫ్ ధాన్యాన్ని ప్రతి రైతు నుండి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
తాహశీల్థారు యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడివాడ మండల పరిధిలో ఎంపిక చేసిన 12 ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అమల్లోకి తెచ్చామన్నారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణాధికారిగా తాహశీల్థారు ఉంటారన్నారు. అదేవిధంగా మడల పరిధిలో ప్రతి పీపీసీ కేంద్రాల వద్ద ఇద్దరు అధికారులను, మిల్లర్సు వద్ద విఆర్వోను జిల్లా కలెక్టరు వారి ఆదేశాలతో నియమించాన్నారు. కార్యదర్శుల, విఆర్వోలు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. మల్లాయపాలె-2 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. అనంతరం ధాన్యం నాణ్యత పరిమాణం గుర్తించే విధానాన్ని, కొనుగోలు కేంద్రం సిబ్బంది అధికారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ వ్యవసాయ శాఖ ఏడి రమాదేవి, మార్కెట్ యార్డ్ కార్యదర్శి వి. భాస్కరరావు, పలువురు రైతు సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *