పిపిసి కేంద్రాన్ని జేసి డా.బి ఆర్ .అంబేద్కర్, కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తో కలిసి తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యర్నగూడెం పిపిసి కేంద్రాన్ని జేసి డా.బి ఆర్ .అంబేద్కర్, కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తో కలిసి తనిఖీ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కు సంబంధించిన కంప్యూటర్ లో నమోదు వివరాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో శాశ్వత రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం తేమ శాతం 17 లేదా 16 ఉండాలని అన్నారు. తేమ శాతం తగ్గించేందుకు అవసరమైన అరవేసే యంత్ర పరికరాలు కూడా అందుబాటులో కి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి రైతు నష్టపోకూడదనే ఉద్దేశం తో ఉన్నామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *