ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26,27 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొనాలి…

-రెండు రోజుల పాటు పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్వాతంత్ర్య స్పూర్తి నింపే సాంస్కృతిక ప్రదర్శనలు
-తొలిరోజు నగరం నాలుగుదిక్కుల నుంచి ర్యాలీలు
-జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాధీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని పిబి సిద్దార్థ కళాశాలలో స్వాతంత్ర్య స్ఫూర్తి నింపే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ తెలిపారు.
స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాoగంణంలోని తమ క్యాంపు కార్యాలయంలో బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం సమర్పించిన రోజును పురస్కరించుకొని దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ నవంబర్ 26 నుంచి 27 వరకు రెండు రోజులు పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్న మన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ వారి సూచనలతో
జిగ్నాసా ,యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య స్ఫూర్తిని అందించే కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు.
ఈ నెల 26,27 తేదీల్లో రెండు రోజులు పాటు దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విదంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత దేశ 75 వసంతాల పండుగ లో దేశంలో 75 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా,మన రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 నగరల్లో విజయవాడ ఒకటిగా ఉండడం విశేషమన్నారు.ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం యువతకు మహాసదావకాశమని ఆయన పేర్కొన్నారు.
జిగ్నాసా డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ 26 వ తేదీ ఇందిరాగాంధీ స్టేడియంకు నాలుగు వైపులా ఎస్ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీబీ సిద్దార్థా డ్రిగ్రి కళాశాల, బాపూజీ మ్యూజియం, బెంజ్ సర్కిల్ నుంచి సుమారు 4 వేల మంది విద్యార్థిని,విద్యార్థులతో ఉదయం 7 గంటల నుంచి వివిధ సాంప్రదాయ వేషదారణలతో, నృత్యాలు, సంగీత వాయిద్యాలతో దేశ సంస్కృతీ సoప్రదాయాలను తెలియజేసే విధంగా ర్యాలీని నిర్వహించి ఉదయం 11 గంటలకు ఇందిరాగాంధి స్టేడియంకు చేరుకుని భారతదేశ పఠం ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన ఇస్తారన్నారు.ఈ రెండు రోజులు పాటు మొగల్రాజపురం పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఖాదీ భారతం సంప్రదాయ వస్త్రధారణ, భారత సంస్కృతి, వీధినాటకం, సంస్కృతి ధర్పణ్, ఎక్ భారత్, శ్రేష్టభారత్ బృంద నృత్యాలు, పాఠలు, అభినయం, చిత్రలేఖనం, వ్యకృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించడం జరగుతందన్నారు. అదే విధంగా ఆప్పటి జాతీయ నాయకుల వేషధారణలతో మాక్ పార్లమెంటు నిర్వహించబడుతుందన్నారు.ఇందులో 6 వ తరగతి విద్యార్థుల నుండి 30 సంవత్సరాలు వయస్సు గల యువతీ యువకులు ముందుగానే తమ పేర్లును నమోదు చేసుకోవచ్చునని, అదేరోజు ఉదయం వేదిక వద్ద కూడ నమోదు చేసుకొని పాల్గొనవచ్చునన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని సుమారు 40 తెలుగు సంఘాలు సహకారం అందిస్తున్నయని తెలిపారు.
సమావేశంలో కార్యక్రమ కన్వీనర్ గాయత్రి, కో ఆర్డినేటర్లు యాపిల్ హాస్పిటల్ చైర్మన్ రామచంద్,భావనాషా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ యు.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *