పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయనిది : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అని, ప్రతి ఒక్క పేదవాడు కూడా సంపూర్ణ ఆరోగ్యం తో జీవించాలనే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని,ఆ పధకం పరిధిలో రాని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహకారం అందిస్తూన్నరని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 13వ డివిజన్ కి చెందిన సహస్ర సాయి కు వైద్య పరీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా 6లక్షల రూపాయలు మంజూరు కాగా ఆ ధ్రువీకరణ పత్రం లబ్ధిదారులకు అవినాష్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకులు పాప ఆరోగ్య పరిస్థితి గురించి హైదరాబాద్ లో ప్రైవేటు హాస్పిటల్ లో జరగబోయే బోన్ న్యారో ట్రాన్సప్లాంట్ ఆపరేషన్ గురుంచి తన దృష్టికి తీసుకురాగా తక్షణమేఅధికారులతో మాట్లాడి కేవలం ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి సహాయనిది మంజూరు చేపించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిది పేదల కు వరం అని,సంక్షోభంలో కూడా ఎంతో మంది పేదవారికి ఆ పధకం ద్వారా సహాయం చేయడం జగన్ గారి వల్లనే సాధ్యం అయ్యిందని అన్నారు.కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలలోనే కాకుండా మెరుగైన కార్పొరేట్ వైద్యం కోసం ఇతర రాష్ట్రలకు వెళ్లే వారికి కూడా ఈ పధకం వర్తిపజేయడం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రామాయణపు శ్రీనివాస్, ఉకోటి రమేష్,కోలా ఉమ,యర్రమోతు శ్రీను,పసుపులేటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *