విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజక వర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతూ రాబోయే ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు డివిజన్ కమిటి లు పూర్తి స్థాయి లో నియమించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ సూచనలతో విజయవాడ, చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం లో 34, 35, 37, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55 & 56 డివిజన్ కమిటీలు ఏర్పాటు కై మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని డివిజన్ నాయకులు ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. జనసేన నాయకులు ఆకులు కిరణ్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు ప్రముఖ న్యాయవాదులు పిళ్ల శ్రీనివాసరావు, పిళ్ల రవీంద్ర, రాష్ట్ర చేనేత సంయుక్త కార్యదర్శి నెమల్ల సంజీవరావు ముఖ్య నాయకులుమైలవరపు కొండలరావు స్టాలిన్, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు భత్తుల వెంకటేశ్వరరావు , షేక్ షర్మిల, ప్రదీప్ రాజ్, పిళ్ల శ్రీనివాసరావు, తాజ్ నోత్ మైనర్ బాబు, ఆలమూరు సాంబశివరావు, నగర కమిటీ సభ్యులు వెన్న శివ శంకర్, కమల సోమనాథం, షేక్ మోబిన్, శనివారపు శివ, కొర్ర గంజి వెంకటరమణ, మురళి కృష్ణ, బోట్ట సాయి, వసంత కుమార్, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు పవన్ సాయి శర్మ, రాళ్ల పూడి గోవిందు, కూర్మా రావు, బుద్ధ ప్రసాద్, మరియు కార్యకర్తలు , డివిజన్లకు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News