-జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో జగనన్న పాలవెల్లువను సమర్థవంతంగా అమలు చేయాలి…
-అధికారులకు జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు.
నగరంలోని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) క్యాంపు కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూమ్ లో గురువారం జగనన్న పాలవెల్లవ లో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక విభాగాలైన ఏపీడీడీసీఎఫ్, జీఎస్ డబ్ల్యూ, ఇన్ఫోసిస్ టీమ్ లు మరియు యంపీడీవోలు, రూట్ అధికారులు, పశు సంవర్థకశాఖ అధికారులు, వైద్యులతో జాయింట్ కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన 26 మండలాల్లో విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ కింద జిల్లాలో తొలి విదడతోలో 300 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను సిద్దం చేశామన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో పాల ఉత్పత్తులను అంచనా వేసేందుకు ఇప్పటికే వాలెంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే చేపట్టి పాడి పశువులు కలిగిన మహిళల వివరాలను యాప్ లో వాలెంటీర్లు నమోదు చేస్తున్నారన్నారు. లబ్దిదారులు వివరాలు, ఇతర అశాలను యాప్ లో నమోదు చేసే సమయంలో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించే విధంగా నేడు సాంకేతిక విభాగాల ఏపీడీడీసీఎఫ్, జీఎస్ డబ్ల్యూ, ఇన్ఫోసిస్ నిపుణులతో వాలంటీర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, రూట్ అధికారులు, వెల్పేర్ అసిస్టెంట్లకు సాంకేతిక పరమైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ జేడీ డా. విద్యాసాగర్, అసిస్టెంట్ డైరెక్టరు, జగనన్న పాల వెల్లు నోడల్ అధికారి డా.లలిత్ కుమార్,పశుసంవర్థక శాఖ వైద్యులు, యంపీడీవోలు, రూట్ ఆఫిసర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News