విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు కాపు సంక్షేమానికి గడిచిన రెండేళ్లలో 5700 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి రావు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ కార్యాలయం లోని చైర్మన్ ఛాంబర్ నందు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాపు నేస్తం పధకం ద్వారా రూ. 980 కోట్లు, విద్యా దీవెన పథకంనకు గాను రూ. 540 కోట్లు, వై ఎస్ ఆర్ ఆసరా స్కీం నిర్వహణ కొరకు రూ. 1370 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా అమ్మ ఒడి పధకమునకు కాపు సోదరుల పిల్లలకు రూ. 600 కోట్లు, వై ఎస్ ఆర్ ఫించన్ కు గాను రూ. 1800 కోట్ల రూపాయలు చొప్పున గడిచిన రెండున్నరేళ్ళకాలంలో రూ. 5700 కోట్లు కాపుసంక్షేమానికికేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన రెడ్డికే దక్కుతుందన్నారు.
కాపు కులం లోని పేద, మధ్య తరగతి వర్గాల వారందరికీ కూడా ఇంటి స్థలం మరియు ఇళ్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇన్ని కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సరిక్రొత్త నిర్ణయాలు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేయడం అభినందనీయం అన్నారు. అందుకు గాను రాష్ట్రం లోని అన్ని కార్పొరేషన్లు కలిసి 13 జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల పై విస్తృత ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చైర్మన్ ప్రకటించారు.
2014 నుండి 2017 వరకు కేటాయింపులు ఏమాత్రం ఆశాజనకంగా లేవన్నారు. 2018-19 లలో మాత్రం విదేశీ విద్య నిమిత్తం కేటాయింపుగా రూ. 1800 కోట్లు మాత్రం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. విదేశీ విద్య విషయంలో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులు దుర్వినియోగం పై మా ప్రభుత్వం దృష్టికివచ్చిందన్నారు. అయితే విదేశ విద్యకు వెళ్లిన విద్యార్థులఫీజులు సకాలంలో చెల్లించని గత ప్రభుత్వం పై విజిలెన్సు విచారణ కు ఆదేశించడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో విదేశీ విద్య కొరకు వెళ్లిన విద్యార్థుల సమస్యల పట్ల మరియు నకిలీ విశ్వవిద్యాలయాల పేరుతో ఆర్ధిక పరమైన అవకతవకలపై న్యాయ పరమైన విచారణ నిర్వహించడం జరుగుతుందన్నారు. విచారణ పూర్తి అయిన వెంటనే నవంబర్ నెలాఖరు నాటికి ఈ సమస్యకు పరిష్కారంగా మెరిట్ విద్యార్థులను గుర్తించి వారి బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు గాని వారి తల్లి దండ్రులకు గాని ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలనిచైర్మన్ హితవు పలికారు. విద్యా కోర్సులు పూర్తయిన వెంటనే యూనివర్సిటీలకు బకాయిలను పూర్తిగా చెల్లించి, విదేశాల నుండి స్వస్థలాలకు ప్రభుత్వం ద్వారా తరలించడం జరుగుతుందని కాపు కార్పొరేషన్ చైర్మన్అడపా శేషగిరి రావు వివరించారు.
Prajavartha Online Telugu News