-జగనన్న సంపూర్ణ భూహక్కుతో ఇంటి యజమానులకు భరోసా …
-ఓటిఎస్ కింద ఇంతవరకు రూ.3.39 కోట్లు వసూలు …
-ఓటిఎస్ లబ్దిదార్ల సందేహాలను నివృత్తి చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ పై విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ఓటిఎస్ లబ్దిదారుల అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొని లబ్ధిదారులు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేయడంతో లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల పట్టాలను రిజిస్టర్ చేసి వారి పేరుతో మంజూరైన పట్టాలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ లబ్దిదారులకు అందజేశారు. జగనన్న సంపూర్ణ హక్కు పథకం ఇంటిపై పూర్తి హక్కును పొందే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఓటిఎస్ ద్వారా నిర్దేశించిన అతి తక్కువ రుసుమును ఒకే విడతలో చెల్లించడం ద్వారా లబ్దిదారునికి ఇంటి పై సంపూర్ణమైన హక్కు కలుగుతుందన్నారు. జిల్లాలో 2,80,012 మంది లబ్ధిదారులు ఉండగా వారిలో ఇంతవరకు 2,40,264 మందిని లబ్ధిదారులను ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. ఇంతవరకు 3,876 మంది లబ్ధిదారులు 3 కోట్ల 39 లక్షల 94 వేల 927 రూపాయలు ఓటిఎస్ కింద వసూలు జరిగిందన్నారు. లబ్ధిదారులు తమ సమీపంలోని సచివాలయంలో రుసుము చెల్లించి, పట్టా పొందడంతో పాటు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం ఇంత చేసేటప్పుడు ఆ అవకాశాన్ని మంచిగా వాడుకోవాలన్నారు. కొంత మంది ఈ పథకంపై అవగాహన లేక ఎందుకు కట్టాలని ఆలోచన చేస్తున్నరే తప్ప చట్టపరంగా పట్టాతో ఆ ఇంటిపై శాశ్వత హక్కు లభిస్తుందనే విషయాన్ని మరవకూడదన్నారు. ఒక వేళ ఇంటిని విక్రయించుకోవడంలో కూడా దీనివల్ల ఎటువంటి అటంకాలు కలగవన్నారు. ఈ సమావేశంలో సుమారు 60 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఓటిఎస్ పై ఎంతో ఓపిగ్గ తాము వెలిబుచ్చిన సందేహాలను పూర్తిగా నివృత్తి చేయడంపై లబ్ధిదారులు తమ సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ శ్రీనివాస్ నాయక్, హౌసింగ్ డిఇ రవికాంత్, ఇఓఆర్డ్ శేషగిరిరావు, విఆర్ వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News