Breaking News

వరిసాగు చేస్తున్న పొలాలను, వరి నూర్పిడిలను పరిశీలన…   

విజయవాడ/పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు మండలంలోని తాడిగడప గ్రామంలో గురువారం పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ ఎస్. ఢిల్లీరావు వరిసాగు చేస్తున్న పొలాలను, వరి నూర్పిడిలను పరిశీలించారు. ఈ సందర్బంగా తాడిగడప గ్రామంలో వరి సాగు చేయుచున్న రైతు నెక్కలపూడి రాఘవయ్య తో సంబాషించి సదరు రైతులు మద్దతు ధర పొందుచున్నది లేనిది పరిశీలించి, సాగుచేయు ధాన్యము రకములు తెలుసుకున్నారు. సదరు గ్రామం లో రైతు భరోసా కేంద్రం, పిపిసి సిబ్బంది తో మాట్లాడి ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేయుచున్నారో తెలుసుకున్నారు. రైతులతో ముచ్చటిన్చుచు ఈ సంవత్సరం దాళ్వా లో వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించవలసిందిగా సూచించారు. రైతులందరూ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తగిన మద్దతు ధరకు అనగా A గ్రేడు 1960/-(క్వింటాకు ), కామన్ రకం 1940 (క్వింటాకు) పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమం లో తహసిల్దారు జి. భద్రు, డిప్యూటీ తహసీల్దార్ బి.రామకృష్ణ, ఏవో ఎల్.శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *