విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షోభ సమయంలో కూడా నిరాటంకంగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ 21వ డివిజన్ కి చెందిన మలిశెట్టి వెంకట కృష్ణారావు కు వైద్య చికిత్స నిమిత్తం మంజూరు అయిన 85 వేల రూపాయల చెక్కును వారి సతీమణి శారద కు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుచ్చిబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని, నిత్యం ప్రజలలో ఉంటూ కులమత పార్టీఅలకటితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుప్పాల కుమారి, కొరివి చైతన్య వర, ఉదయ్, బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News