మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ డివిజన్లలో జనాభా నిష్పత్తి ప్రకారం పారిశుధ్య కార్మికుల అవసరతను బట్టి , పట్టణ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్లో తీర్మానం, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే పారిశుధ్య కార్మికులను నియమిస్తారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ, ఆ సమయంలో సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు.
తొలుత భాను అనే మహిళ మంత్రిని కలిసి తన కస్టాలు చెప్పుకొంది. తాను ఎం ఏ , బి ఇడి చదివేనని తన భర్త చిన్న చిన్న రిపేర్ పనులు చేస్తారని ఇద్దరు పిల్లలతో కుటుంబ పోషణ ఎంతో దుర్భరమై ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్నానని తనకు మచిలీపట్నం కార్పొరేషన్లో ఒక స్వీపర్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకొంది.
50 వ డివిజన్ కు చెందిన వడ్డాది సుజాత అనే మహిళ తాను మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు స్వీపర్ గా 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నానని గత కొద్దికాలంగా తనకు ఆరోగ్యం బాగుండటం లేదని తనకు బదులుగా తన కుమారుడిని ఇదే పనిలో నియమించాలని మంత్రిని ఆమె అభ్యర్ధించారు.
మచిలీపట్నం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన అర్జా యోగేశ్వరరావు మంత్రి పేర్ని నానిను కలిసి తన ఇబ్బంది చెప్పుకొన్నారు. ఫీజు మొత్తం చెల్లిస్తే తప్ప మీ బాబుకు టీ సి ఇవ్వం అని కెకెఆర్ గౌతమ్ స్కూల్ యాజమాన్యం చెబుతుందని దీంతో తన కుమారుడిని చిన్నాపురం కేరళా పబ్లిక్ పాఠశాలలో 8 వ తరగతిలో చేర్పించడానికి వీలు లేకుండా పోయిందని మీరే ఏదైనా పరిష్కారం చూపాలని అడిగారు.
స్థానిక గొడుగుపేటకు చెందిన వెంపరాల గీత నాగలక్ష్మి అనే మహిళ మంత్రిని కలిసి తన సమస్య వివిరించింది. తాను పమిడిముక్కల మండలంలోని ఒక పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్ గా గత 7 సంవత్సరాలుగా పని చేస్తున్నానని , ఇటీవల తన స్కూటీ నుంచి కింద పడిపోయానని దాంతో మెడ ఎముక విరిగిందని దాంతో నిత్యం అక్కడకు వెళ్లి రావడం ఎంతో ఇబ్బందిగా ఉందని, గూడూరు హైస్కూల్ లో ఇటీవల క్రాఫ్ట్ టీచర్ ఖాళీ ఏర్పడిందని అన్నాను అక్కడకు బదిలీ చేయాలని విన్నవించింది.
స్థానిక చిలకలపూడి చెందిన జాఫల్ ఉన్నీసా అనే మహిళ తనకు ఆరోగ్యం సరిగా లేదని దయతో మీరు హెల్త్ కార్డు మంజూరు చేయించాల్సిందిగా మంత్రి పేర్ని నానిను అడిగారు.
Prajavartha Online Telugu News